దిల్లీ: కరోనా కారణంగా ఆదాయం భారీగా పడిపోయినందున కేంద్ర ప్రభుత్వ అత్యవసర నిధి నుంచి సాయం అందించాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. దిల్లీలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌తో బుగ్గన భేటీ అయ్యారు. కరోనాపై పోరులో రాష్ట్రానికి సాయంపై ఆయనతో చర్చించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వంపై అదనపు భారం పడిందని.. కొవిడ్ కేర్‌కు సంబంధించి మందులు, పీపీఈ కిట్లు ఇతరత్రా అవసరాల నిమిత్తం రూ.981 కోట్ల సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల మంజూరు అంశంపై కేంద్ర మంత్రితో బుగ్గన చర్చించారు. రాష్ట్రంలో జిల్లాల పరిమాణం పెద్దదని.. ఈ మేరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గరిష్ఠ ప్రయోజనం పొందేలా చూడాలని కోరారు.