గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమం
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రతినిధి:- అన్ని దానాల్లో కంటే అన్న దానం మిన్న అని నేషనల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ అన్నారు… కోరుట్ల పట్టణంలో కల్లూరు రోడ్డు కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులలో భాగంగా మైనారిటీ జర్నలిస్టులు అన్నదానం నిర్వహించారు… దాదాపు 100 మంది జర్నలిస్టులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు… ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల పట్టణ సీఐ రాజశేఖర్. వారితోపాటు టైగర్ అలీ నవాబ్…కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కార చంద్ర శేఖర్.. స్థానిక జర్నలిస్టులు హాజరయ్యారు… ఆకలితో అలమటిస్తున్న బడుగు బలహీన వర్గాలకు పాదచారులకు విద్యార్థులకు వైద్య సిబ్బందికి, మరియు పోలీసులకు.. కోరుట్ల ప్రెస్ క్లబ్ మైనారిటీ జర్నలిస్టుల ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రతి వినాయక నవరాత్రులలో భాగంగా అన్నదానం కార్యక్రమాలు చేపడుతున్నారు…. కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్ లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమం
నిర్వహించడం చాలగా గొప్పగా ఉందని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ.పేర్కొన్నారు… అలాగే వారితో పాటు కోరుట్ల మెట్పల్లి డి.ఎస్.పి రవీందర్ రెడ్డి. కోరుట్ల సీఐ రాజశేఖర్. టైగర్ అలీ నవాబ్.. పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు… కుల మతాలకు అతీతంగా కోరుట్ల పట్టణ ప్రజలు ఎప్పుడు ముందస్తుగా ఉంటారని కోరుట్ల సి ఏ రాజశేఖర్ హర్షనీయమన్నారు.. బుధవారం రోజు మధ్యాహ్నం కోరుట్ల ప్రెస్ క్లబ్ మైనారిటీ జర్నలిస్ట్ తరఫున వినాయక నవరాత్రులలో భాగంగా అన్నదానం నిర్వహించారు.. ఈ అన్నదాన కార్యక్రమానికి దాదాపు స్థానిక 700 ప్రజలు అన్నదాన కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేశారు,,ముఖ్య అతిథులుగా కోరుట్ల సీఐ రాజశేఖర్. TWJA అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కర చంద్ర శేఖర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు…