
రోగులకు దుప్పట్లు, కుష్టు రోగులకు బెల్టు చెప్పులు పంపిణీ
గంపలగూడెం (తెలుగుతేజం) : గంపలగూడెం మండలంలో ఊటుకూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో *లెప్రా సొసైటీ వారి ఆధ్వర్యంలో బోదకాలు మరియు కుష్టు వ్యాధి స్వీయ సంరక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో స్వీయ సంరక్షణ పద్ధతి పై బాధితులకు శిక్షణ ఇచ్చి బాధితులు వారి ఇంటి దగ్గర జాగ్రత్తలు పాటించే విధంగా చూడటం దీని ముఖ్య ఉద్దేశం.అదేవిధంగా వీరికి ప్రత్యేక మైక్రో సెల్యులర్ రబ్బర్ తో తయారుచేసిన పాదరక్షలు, దుప్పట్లు 32 మంది రోగులకు లెప్రా సొసైటీ ద్వారా అందజేశారు. లెప్రా సొసైటీ వారు కుష్టు బోదకాలు వారికి అందిస్తున్న సేవలకు గాను, ఏపీ లిడ్ క్యాప్ డైరెక్టర్ డాక్టర్ కోనేరు సత్యప్రియ స్పందించి వైద్యపరంగా రోగులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైనా సరే తాను తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసి. జగనన్న సురక్ష కార్యక్రమంలో అందరూ నార్మల్ చెక్ అప్ చేసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం పై కొద్దిసేపు రోగులతో ముచ్చటించారు. వికలాంగులకు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ ను అందించేలా చూస్తానన్నారు.

అనంతరం గంపలగూడెం మండలంలో పెద్ద క్రోమిర గ్రామంలో అనారోగ్యంతో ఉన్న శేషయ్య ,అమృతమును పరామర్శించి అనంతరం కొత్తపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన అమ్మిరెడ్డిగూడెంలో ఏబీయం స్కూల్ లో హిందీ అధ్యాపకుడిగా పనిచేస్తున్న మెరుగు ప్రసన్న కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చి, బండి నరసింహస్వామి అదే గ్రామంలో పెరాలసిస్ తో బాధపడుతూ ఉన్న అతనికి పలు సూచనలు ఇచ్చారు,ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శశి ప్రియ,ఫిజియోథెరపిస్ట్ నాగరాజు, లెఫ్ట్ రా సొసైటీ అవుట్ రిచ్ వర్కర్ చంద్రశేఖర్ ,అనిల్ ఫార్మాసిస్ట్, సరస్వతి స్టాఫ్ నర్స్, పెద్ద కుమ్మర వైసిపి సీనియర్ నాయకులు బర్రింకల అంజయ్య, బొల్లెపోగు చంద్రశేఖర్, జూపూడి నాగార్జున, మందడపు సత్యనారాయణ, మరియు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సోరగుడి సుధీర్ బాబు, నల్లగట్ల.సందీప్, మేకల సునీల్ , ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.