
గన్నవరం : తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఏపీలోనే తాజా రాజకీయ పరిస్థితులపై ఏపీ కాంగ్రెస్ నేతల తో రాహుల్ గాంధీ అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, జె డి శీలం, మస్తాన్ వలీ రాహుల్ స్వాగతం పలికారు . తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయంలో మరో హెలికాప్టర్‌లోకి మారారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో మనం అధికారంలోకి వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ ఆదరణ లభిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ జోోష్ బాగుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని, సంస్థాగతంగా బలపడాలని నేతలకు రాహుల్ గాంధీ సూచించారు.