తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల మండలం పరిటాల, గొట్టుముక్కల గ్రామాల్లోనీ పోలింగ్ బూతుల ను అడిషనల్ ఎస్పీ మల్లికా గార్గ్ మంగళవారంనాడు పరిశీలించారు. తొలుత దొనకొండ పోలీస్ అవుట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అనంతరం గొట్టుముక్కల గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల భద్రత ఏర్పాట్ల గురించి నందిగామ డిఎస్పీ నాగేశ్వర్రెడ్డి సీఐ సతీష్ ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక మొదటి నోటిఫికేషన్ ప్రకారం నందిగామ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు ప్రతిష్ట మైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగిందని సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించి పలువురుని బైండోవర్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నందిగామ డిఎస్పీ నాగేశ్వర్రెడ్డి, అబ్దుల్ అజీజ్ (మహిళా విభాగం డీఎస్పీ) రూరల్ సీఐ సతీష్, కంచికచర్ల ఎస్సై రంగనాథ్ ఎస్సై టు శ్రీమతి లక్ష్మి చందర్లపాడు ఎస్సై మణికుమార్ వీరులపాడు ఎస్సై ఏసోబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.