
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గ్రామీణ మరియు పట్టణ ప్రజల్లో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి కళాజాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి. మంజుల తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం చిగురు బాలల ఆశ్రమంలో ఆమె మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అవగాహన కల్పించడానికి తద్వారా హెచ్ఐవి నివారణా మార్గాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఉన్న చిగురు బాలల ఆశ్రమంలో మూడు రోజుల పాటు కళాజాత ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో నుండి రెండు బృందాలను ఏర్పాటు చేసి వారికి అవగాహన ఎలా కల్పించాలి అనేదానిపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామన్నారు.