Breaking News

అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలి

ఏపీ జే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజనేయులు డిమాండ్


తెలుగు తేజం, గుంటూరు :
ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఏ విధమైన జాప్యం లేకుండా అక్రెడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని ఏపీ జే ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు డిమాండ్ చేశారు. డిసెంబర్ 31వ తేదీలోగా అక్రిడిటేషన్ లు మంజూరు చేయకుంటే జర్నలిస్టుల ఆందోళనను ఉదృతం చేస్తామని రాష్ట్ర సమాచార శాఖ, ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. అక్రిడిటేషన్ లతోపాటు పలు డిమాండ్లపై గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణాంజనేయులు మాట్లాడారు. రాష్ట్ర సమాచార శాఖ వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అక్రెడిటేషన్ ల మంజూరులో జాప్యం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి యూనియన్ లపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. అక్రెడిటేషన్ కమిటీలో యూనియన్లకు స్థానం లేకపోతే జర్నలిస్టుల హక్కులకు భంగం వాటిల్లుతుందని అనుమానం వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ కమిటీలో గతంలో ఉన్న విధంగా అన్ని యూనియన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీ జే ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దండా గోపి మాట్లాడుతూ 2022 మార్చి వరకు జర్నలిస్టుల హెల్త్ కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో హెల్త్ కార్డులకు నగదు చెల్లించే పరిస్థితుల్లో జర్నలిస్టులు లేరన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టు కు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని ఏపీ జి ఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పొత్తూరి శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. మన డిమాండ్ల సాధన విషయంలో జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ధర్నా కార్యక్రమంలో ఏ పీ జే ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చెవుల రంగారావు, ఏపీ జే ఎఫ్ నాయకులు సూర్య నాయక్, జహారుల్లా, హలీం సాహెబ్, జర్నలిస్టుల యూనియన్ నాయకులు కుమార్ రాజా, ఆర్ టి ఐ సాయి కుమార్, చల్లా మధుసూదన్ రావు, శరణ్య టీవీ శ్రీనివాస రావు, తదితరులు మాట్లాడారు. ధర్నా అనంతరం గుంటూరు జిల్లా డి ఆర్ వో చంద్రశేఖర్ కి వినతి పత్రం సమర్పించారు.
ప్రధానమైన డిమాండ్లు

1) అర్హులైన ప్రతి జర్నలిస్టు కు డిసెంబర్ 31 వ తేదీ నాటికి అక్రిడేషన్ మంజూరు చేయాలి.
2) జర్నలిస్టుల హెల్త్ కార్డులను ఏ విధమైన చెల్లింపులు లేకుండా 2022 మార్చి వరకు పొడిగించాలి.
3) అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించాలి.
4) అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *