Breaking News

కుటుంబ కలహాలతో నే ఎక్కువ ఆత్మహత్యలు:ఎపి డీజీపీ కేవీ.రాజేంద్రనాథ్‌రెడ్డి

విజయవాడ తెలుగుతేజం ప్రతినిధి: ప్రపంచ ఆత్మహత్య లు నివారణ దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్, సైకియాట్రిక్ సొసైటి ఆద్వర్యంలో విజయవాడలో అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినం పురస్కరించుకొని ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా ఎపి డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి విచ్చేసి ర్యాలీని ప్రారంభించరు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాలతో నే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ కేవీ.రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. జాతీయ నేర గణాంక సంస్థ ప్రకటించిన 2021 గణాంకాల్లో ఇదే విషయమై స్పష్టమైందన్నారు.చదువుల విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దని డీజీపీ సూచించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు,అనారోగ్య సమస్యలతో మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బెంజిసర్కిల్‌ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వరకు విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, అధికారులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, మానసిక చికిత్స వైద్య నిపుణులు ప్రదర్శనలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *