Breaking News

గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద భారీగా హవాలా నగదు పట్టివేత

తెలుగు తేజం, జగ్గయ్యపేట : కృష్ణా జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద హవాలా డబ్బు కలకలం రేపింది. వాహనాలు తనిఖీలు చేపట్టిన పోలీసులకు.. ఓ కారులో భారీ మొత్తంలో నగదు గుర్తించారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హవాలా డబ్బును సికింద్రాబాద్‌ నుంచి కోల్‌కతాకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. గోల్డ్‌ వ్యాపారి మహ్మద్‌ భాషాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. హవాలా రాకెట్ అసలు సూత్రదారులకోసం అరా తీస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *