Breaking News

చట్టం గురించి తెలుసుకో-నీ హక్కులు నీవే కాపాడుకో!!!

ప్రభుత్వఉద్యోగిఅవినీతి_చేయడానికి ఉద్యోగంలో చేరుతున్నాడా? లేక ఉద్యోగిగా చేరి అవినీతి పరుడు అవుతున్నాడా ?

ఈ ప్రశ్నకు సమాధానం.???

అమరావతి, తెలుగుతేజం ప్రత్యేక ప్రతినిధి

ఎందుకంటే అక్రమ సంపాదన అన్ని చోట్లా అన్ని శాఖలలో ఉంది. కొన్ని శాఖలు లంచం పొందటంలో హక్కులు కల్గి ఉన్నాయి. ఇటువంటి శాఖలలో సంపాదించకుంటే అతను ఎందుకు పనికి రానివాడి క్రింద లెక్క కట్టేస్తారు. అతని పెళ్లిచేయలన్న అబ్బాయి ఫలానా డిపార్ట్మెంట్ లో ఉన్నాడు పైనఆదాయం బాగుంటుంది అని ఇరుపక్కల పెద్దలు అంటుంటారు.

కొంతమంది ఉద్యోగులు నవ్వుతూ ‘అబ్బా’నేను అడగను వారే ఇచ్చిపోతారు అంటారు. మరి కొంతమంది ఏరికోరి డబ్బులిచ్చి పనిచేసే చోటును కోరుకొంటారు.

ఇంత డబ్బులు ఇచ్చి ఇక్కడికి (ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాను) వొచ్చనయ్య (ఇక్కడ 10 సంవత్సరాల పాటు ఉండడానికి నేను పై అధికారులకు డబ్బు ఇచ్చాను. వేరే చోటకు ట్రాన్స్ఫర్ చేసిన డిపిటేషన్ మీద ఇక్కడే పని చేసున్న అని నేను అంత డబ్బు ఇచ్చాను నేను ఎవరితో చెప్పుకోవాలి అంటుంటారు”.
ఇది బహిరంగ రహస్యం. ప్రజలైతే “ఏదోఒకటి “ఇచ్చి పనిచేసుకోవాలి అంటూ సలహాలు ఇస్తుంటారు.

జీత భత్యాలు పెరిగినా చాలా మంది ఉద్యోగస్తులకు అక్రమార్జన పైన దృష్టి అయితే ఈ మధ్యకాలంలో ఉద్యోగుల అక్రమార్జనకు అంతం లేకుండా పోతు ఉంది.

తెలంగాణలో ఓ తహసీల్దార్ మీద పెట్రల్ పోసి చంపితే తెలుగు. రాష్ట్రాలలో రెవిన్యూ ఉద్యమం చేశారు సంరక్షణ కావాలి అని ధర్నాలు రాస్తాకోలు చేశారు.

అవినీతి ఉద్యోగులను సస్పెండ్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదు

ఈ నెలలోనే కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులును ఆడ మగ తేడా లేకుండ అవినీతి నిరోధక శాఖవారు పట్టుకొంటే కొన్ని కోట్ల అక్రమార్జన బయటపడింది. గతంలో కూడా ఈవిధంగా దొరికినవారు కో కొల్లలు. రెండు నెలల క్రింద ఎమ్మార్వో ఒకరు ఏకంగా “ఒక కోటి పది లక్షలు “లంచం తీసుకొంటు దొరికినప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు దేశమే ఉలిక్కి పడింది. తరువాత “ఓ ట్రేజరి ఉద్యోగి.. ఎనిమిది ట్రంకు పెట్టలు “కథ విని అందరూ కొయ్యబారారు. అసలు సంగతి ఎందిరా ! అంటే వీరు దొరికినంత వరకు దొరలు మాదిరిగా తిరగటం.వీళ్ళ భాగోతం అంత వరకు ఎవరికి తెలియక పోవడం చాలా ఆశ్చర్యం.

“ఇది వారి సంస్థల, అధికారుల తీరు పై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. “ఇదియే కాకా ఆ ఉద్యోగి విలాసమైన జీవితం గురించి పత్రికల్లో కూడా చాలా వచ్చింది. అతనికి ఉన్నటువంటి ఎక్కువ విలువ కల్గిన
టూ వీలర్లు, ట్రాక్టర్ లు, ఫామ్ హౌస్ ఇలా ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇంత విలాస జీవితం గడిపిన ఇతని పై ఎవరికి అనుమానం రాలేదా? వచ్చిన నిఘా సంస్థలు, అధికారులు, పత్రికల వారు, సహఉద్యోగులు పట్టించుకోలేదా? లేక మన కెందుకులే అని అనుకొన్నారా? లేకపోతే చూసిచూడనట్లుగా ప్రవర్తిస్తున్నారా? అన్నది కోటి రూపాయల ప్రశ్న.

బాధితులు చెబితేనే కానీ నిరోధక సంస్థలు స్పందించక పోవడం బాధాకరం. ఒక వ్యక్తి కోటి రూపాయల అక్రమార్జన చేశాడంటే నూరు కోట్ల అక్రమ లావాదేవీలకు తలుపులు తెరచినట్లే లెక్క. కొంతమంది ప్రాణంపోయిన చేయి చాపని వారు ఉన్నారు వారికి శిరస్సు వొంచి మ్రొక్కలి .”కానీ..మనం తీసుకొన లేదు కదా .. మనకెందుకులే” అని భావించడం కన్నా ఇతరులు కూడా తీసుకొనకుండా చూడాల్సిన బాధ్యత అందరి పై ఉంది ఎందు కంటే మంచి పౌరునిగా అక్రమం గా ఏదన్నా జరుగుతున్నపుడు దాన్ని ఎదుర్కొనలి. లేనప్పుడు వాటిగురించి నిఘ సంస్థలకు తెలియ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.

“అవినీతి రహిత” సమాజ అవసరం ఈ దేశానికి ఎంతైనా ఉంది! లేదంటే భావితరాలు క్షమించవు.

ఒక్కసారి లంచం తీసుకుంటు పట్టుబడితే శాశ్వితంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి తప్పించాలి.అవినీతికి పాల్పడిన వారికి రాజకీయాల్లో గాని, ఎటువంటి కార్యక్రమల్లోగాని పాల్గొనరాదు భవిష్యత్ అతని కుటుంబానికి ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి అందకుండా చట్టం తీసుకొని రావాలి.

  • -కేతన సత్యనారాయణ, స్టాఫ్ రిపోర్టర్

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *