Breaking News

చిన్నారిపై వీధి కుక్కలు దాడి

వత్సవాయి తెలుగతేజం విలేకరి: 18 నెలల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన కృష్ణాజిల్లా వత్సవాయి మండలంలోని కంభం పాడు గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన చేకూరిశ్రీకాంత్ కుమారుడు చేకూరి హర్షవర్ధన్ ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న సమయంలో లో వీధికుక్కలు చిన్నారి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి గాయాల పాలయిన బాలుణ్ణి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు ఇటీవల కాలంలో గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి గతంలో మునిసిపాలిటీ సిబ్బంది మరియు పంచాయతీ సిబ్బంది స్పందించి కుక్కల బెడద ను తగ్గించే వారు కానీ ప్రస్తుతం గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో వాహనదారులు వాహనంపై వెళుతుండగా వేటాడే విధంగా వెంట పడడంతో వాహనచోదకులు కిందపడి గాయాలపాలైన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి ఇప్పటికైనా పంచాయతీ సిబ్బంది స్పందించి గ్రామాల్లో స్వైర విహారం చేస్తున్న కుక్కలను అదుపు చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు అయితే బాగుంటుందని మండల ప్రజలు కోరుతున్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *