తెలుగుతేజం, తిరువూరు ప్రతినిధి: రాహుల్ జోడోభారత్ యాత్ర జయప్రదం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు రావాలని తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ రాజీవ్ రతన్ కోరారు. గురువారం తిరువూరు రాజీవ్ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈనెల 14 నుండి ఈ యాత్ర ఏపీలో ప్రవేశించి, వంద కిలోమీటర్ల మేర సాగుతుందని, అన్ని ప్రాంతాల నుండి మద్దతుగా పాదయాత్రలు జరుగుతున్నందున, తిరువూరు నియోజకవర్గం నుంచి కూడా సంఘీభావ యాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. సమావేశం లో పార్టీ నాయకులు పల్లెపాటి శ్రీనివాసరావు, గంజా కృష్ణమోహన్, కొత్తగుండ్ల గోపాలకృష్ణ, విజయలక్ష్మి, ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.