తెలుగు తేజం:నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి… ఈ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా.. 824 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 12వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ కవిత బరిలో ఉండగా… కాంగ్రెస్ పార్టీ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. 12వ తేదీన రెండు రౌండ్లలోనే ఫలితాలు తేలిపోనున్నాయి.. అయితే, తొలిరౌండ్‌లోనే విజేత ఎవరో తేలిపోనుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత విజయం ఖరారైనట్టుగానే చెబుతున్నారు.. టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 80 శాతం ఓట్లు పడినట్టు ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.. అంతేకాదు.. కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది క్రాస్ ఓటింగ్ చేశారనే ప్రచారం సాగుతోంది.. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన పోలింగ్‌లో ప్రజాప్రతినిధులతో పాటు.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాల్సిన ప్రజాప్రతినిధులకు ముందే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.. వారిలో 24 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా… కరోనా పాజిటివ్‌గా తేలిన ప్రజాప్రతినిధులు 24 మంది పీపీఈ కిట్లతో వచ్చి పోలింగ్ ముగిసే సమయంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
.