Breaking News

నేడు జాతీయ ఓటరు దినోత్సవం.. ‘హలో ఓటర్స్​’ను ఆవిష్కరించనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి

ఢిల్లీ : జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకొని డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులను ఆవిష్కరించనున్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఐదుగురు కొత్త ఓటర్లకు ఈ ఎలక్ట్రానిక్ ఓటర్ ఐడీలను అందించనున్నారు.

మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల నుంచి సులభంగా డౌన్​లోడ్ చేసుకునే విధంగా ఈ-ఓటర్ కార్డు రూపొందించారు. పీడీఎఫ్ రూపంలో ఈ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు. డిజిటల్ లాకర్​లలోనూ భద్రపరుచుకోవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.

కాగా, నేడు 11వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ‘మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్డ్, విజిలెంట్, సేఫ్ అండ్ ఇన్​ఫార్మ్​డ్’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తోంది భారత ఎన్నికల కమిషన్. ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రపతి భవన్​ నుంచి వర్చువల్​గా పాల్గొననున్నారు. గౌరవ అతిథి హోదాలో మంత్రి రవి శంకర్ ప్రసాద్ కార్యక్రమానికి హాజరవుతారు.

కార్యక్రమంలో భాగంగా 2020-21 సంవత్సరంలో ఎన్నికలకు సంబంధించి జాతీయ అవార్డులను రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ప్రకటించనున్నారు. ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈసీకి చెందిన వెబ్​రేడియో ప్లాట్​ఫాం- ‘హలో ఓటర్స్​’ను ఆవిష్కరించనున్నారు.

2011 జనవరి 25 నుంచి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఈసీ నిర్వహిస్తోంది. 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటుకు గుర్తుగా ఈ కార్యక్రమాన్ని జరుపుతోంది.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *