Breaking News

మంచి జరిగితే రాబందులకు నచ్చదు: సీఎం జగన్‌

కాకినాడ / కోనసీమచంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని కోరారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ళలో నాలుగో ఏడాది ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా భావించామన్నారు.‘మత్స్యకారుల కష్టాలను పాదయాత్రలో దగ్గరగా చూశా. వరుసగా నాలుగో ఏడాది కూడా మత్స్యకార భరోసా అమలు చేస్తున్నాం. ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నాం. 1,08,755 మంది మత్స్యకారులకు రూ.109 కోట్లు జమ చేస్తున్నాం. మత్స్యకార భరోసా కింద ఇప్పటివరకు రూ.418 కోట్ల సాయం అందించాం. వేట కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు ఓన్‌జీసీ పరిహారం అందిస్తున్నాం. జీవనోపాధి కోల్పోయిన 69 గ్రామాల మత్స్యకార కుటుంబాలకు రూ.11,500 చొప్పున 4 నెలలపాటు ఓన్‌జీసీ చెల్లించిన రూ.108 కోట్ల పరిహారం అందిస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.217 కోట్లు జమ చేస్తున్నాం. గత ప్రభుత్వం బకాయిపెట్టిన 70 కోట్లను మన ప్రభుత్వమే చెల్లించిందని’’ సీఎం అన్నా

CM YS Jagan Speech In YSR Matsyakara Bharosa Program Konaseema - Sakshi

సీఎం జగన్‌ ప్రభుత్వంలో పేదలకు మంచి జరగడాన్ని దుష్ట చతుష్టయానికి నచ్చదు. కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా వారికి బాధే.. అప్పులు వచ్చినా వారికి బాధే. ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్న రాబందులను ఏమనాలి?. వీరిని రాష్ట్ర ద్రోహులు అందామా.. దేశ ద్రోహులు అందామా?. కళ్లు ఉండి మంచిని చూడలేని కబోదులు. కుప్పంలో ఇళ్లు కట్టుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ లేదు. జగన్‌ పరిపాలన చూశాకే కుప్పంలో చంద్రబాబు ఇళ్లు కట్టుకుంటున్నారు. వక్రబుద్ధి ఉన్న చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని దేవుడిని కోరుకుంటున్నానని’’ సీఎం జగన్‌ అన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *