Breaking News

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం విచారకరం: మాజీ ఉపసభాపతి: మండలి బుద్ధ ప్రసాద్

అవనిగడ్డ (తెలుగు తేజం ప్రతినిధి): తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విచారకరమని అవనిగడ్డలో శనివారం మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో 1968లో తెలుగు అకాడమి నెలకొల్పబడిందని, పరిశోధనలకు, ఆధునీకరణకు, భాషా వ్యాప్తికి కృషి చేయడం ఈసంస్ద లక్ష్యమన్నారు. ఆనాటి విద్యామంత్రి పీ. వి. నరసింహరావు తొలి అధ్యక్షులని, ఇంటర్ నుంచి పీజీ వరకు పాఠ్యగ్రంధాలను తయారుచేయించి ప్రచురించిందన్నారు. దాదాపు 300కోట్ల నిధులతో స్వయం ప్రతిపత్తి గల సంస్దగా రూపొందిందని, రాష్ట్ర విభజన తరువాత మనకు రావలసిన నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విపలమైందన్నారు. లక్ష్మీపార్వతిని అధ్యక్షురాలిగా ప్రకటించి నామమాత్రంగా తెలుగు అకాడమిని ఏర్పర్చారు తప్ప నిధులివ్వలేదని, చేసిన పనులూ లేవన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి సంస్కృతం మీద ప్రీతి ఉంటే ప్రత్యేక అకాడమిగా ఏర్పర్చాలి తప్ప తెలుగు అకాడమీలో కల్పడం భావ్యం కాదన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తెలుగు అకాడమి చరిత్రను, లక్యాలను ఇప్పుడైన తెలుసుకోవాలన్నారు. తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం మంచిదికాదన్నారు. మన మాతృభాషను గౌరవించుకోవడం మన ప్రభుత్వాల ప్రధమ కర్తవ్యం కావలసింది పోయి, తెలుగు భాషను అంతం చేయడానికి పుట్టినట్లు వ్యవహరించడం విచారకరమన్నారు. ఇప్పటికే మాతృభాషా మాధ్యమానికి మంగళం పాడారు, ఇక తెలుగు సంస్దల వంతుకి వచ్చినట్లుందన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *