Breaking News

లక్ష్మీనరసింహపురానికి దారేది?

తెలుగు తేజం , గుడివాడ : ఆంధ్రప్రదేశ్లో వర్షాకాలం వచ్చిందంటే ఇలాంటి పల్లెలలు ఎన్నో మనకు తారస పడుతూనే . ఇలాంటి పల్లెలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించ నాయకులను, అధికారులను ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఆ ఊరి జనం ఇది ఎక్కడో కాదు గుడివాడ కు కూతవేటు దూరంలో నందివాడ మండలంలోని లక్ష్మీ నరసింహ పుర మే ఆ గ్రామం. ఆ గ్రామానికి వెళ్లాలంటే సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరం ఎటువంటి రహదారి నిర్మాణం లేదు తేలికపాటి వర్షాని కే నడుము లోతు నీటిలో నడిచి వెళ్ళ వలసిన పరిస్థితి దుస్థితి ఆ గ్రామస్తుల ది సుమారుగా ఐదు వేల మంది నివసించే గ్రామం నుండి ఇ ప్రతిరోజు ఏదో ఒక పని మీద గుడివాడ పట్టణానికి వెళ్ళవలసిన పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలకు రహదారి మొత్తం నీటితో నిండి పోయి గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు ఈ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *