- తప్పిన ప్రమాదం
తెలంగాణ సచివాలయంలో పెద్ద ప్రమాదమే తప్పించి. సచివాలయ భవన ఆరో అంతస్తు నుంచి పీవోపీ పార్టిషన్ దిమ్మె లాంటి భారీ పెచ్చు ఊడి కింద పడింది. సీఎం ఛాంబర్ అంతస్తు నుంచే ఈ దిమ్మె ఊడటం గమనార్హం. అయితే.. ఊడిన దిమ్మె కింద నిలిపి ఉంచిన రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడింది. దీంతో.. కారు రూఫ్ తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందారు. పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకవేళ అక్కడ కారు లేకుండా ఎవరైనా జనాలు ఉండి ఉంటే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.