Breaking News

శ్రీలంకకు కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే

Ranil Wickremesinghe Sworn As Sri Lanka New PM - Sakshi

కొలంబో: కల్లోల శ్రీలంకకు కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. గురువారం సాయంత్రం అధ్యక్ష భవనంలో ఈ ప్రమాణోత్సవం జరిగింది. ఇదిలా ఉంటే లంకకు ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఎంపిక కావడం కొత్తేం కాదు. గతంలో దఫాలుగా ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం వీలైనంత త్వరగా సమసిపోవాలంటే అనుభవజ్ఞుడైన విక్రమసింఘే లాంటి వాళ్లు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు హింస తీవ్రరూపు దాల్చుతుండడం ఆందోళన కలిగిస్తున్నా, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే వంటి అనుభవశాలి, వివాదరహితుడు మళ్లీ ప్రధాని పీఠం ఎక్కనున్నారన్న వార్తలు.. అక్కడి పౌరుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *