Breaking News

32వ జాతీయ రహదారి భద్రత మాసోత్స‌వాలు ప్రారంభించిన- జిల్లా కలెక్టర్ ఎ ఎండి ఇంతియాజ్

తెలుగు తేజం, కృష్ణాజిల్లా కలెక్టరేట్ : 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్స‌వాలు డిటీసీ యం పురేంద్ర అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఎ ఎండి ఇంతియాజ్ మరియు జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు సోమవారం మచిలీపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వేగాన్ని నియంత్రించుకుని ప్రయాణాలు చేసినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సంఖ్య తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రమాద రహిత జిల్లాగా కృష్ణా జిల్లాకు మనం అందరం చూడాలని అందుకు ప్రతి ఒక్కరు వాహనాలను సక్రమంగా నడపడంతో పాటు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనంతరం కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు మాట్లాడుతూ జాతీయ రహదారులపై ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులే ప్రమాదాలు గురవుతున్నారని, దానికి కారణం అధికావేగం, హెల్మెట్ దరించపోవడమేనని ఆయన అన్నారు. జాతీయ రహదారులపై స్పీడ్ గన్ లను మరికొన్ని చోట్ల ఏర్పాట్లు చేసి, స్పీడ్ నియంత్రణ చేయ్యాలన్నారు. డిటీసీ యం పురేంద్ర మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రత కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వారం రోజులపాటు చెయ్యడం జరిగేదని, కానీ ఈ సంవత్సరం ప్రజలలో రోడ్డు భద్రతపై పూర్తి స్థాయిలో అవగాహనను పెంపొందించే విధంగా నెల రోజుల పాటు రహదారి భద్రత కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అన్ని ప్రభుత్వశాఖలను ఎన్ జీ ఓ లను కలుపుకొని కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అనంతరం రహదారి భద్రత పై రూపొందించిన 2021 క్యాలెండర్ ను, కర పత్రాలను, వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఎ ఎండి ఇంతియాజ్, జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు, డిటీసీ పురేంద్ర సంయుక్తం గా విడుదల చేసి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రచార రధాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్స్పీ మల్లిక గార్గ్, డిఆర్ఓ యం వెంకటేశ్వరరావు, ఏపిఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ అప్పలరాజు, ఆర్టీవోలు ఎవి సారధి, కె రాంప్రసాద్, టివిఎన్ సుబ్బారావు, అధికారులు వై నాగేశ్వరరావు, బి స్వర్ణ శ్రీనివాస్, జి సంజీవ్ కుమార్, బి వి మురళి కృష్ణ, కె వి ఎన్ ప్రసాద్, సి హెచ్ శ్రీనివాసరావు, యం రాజుబాబు, శ్రీమతి బి జ్యోతి ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *