ఇబ్రహీంపట్నం దేవాదాయ భూముల సమస్యను రాజకీయం చేసేందుకు పక్కా వ్యూహం రచించిన తెలుగు తమ్ముళ్లు…..
పచ్చ పేపర్ ను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నేతలను ఉద్దేశించి తప్పుడు కథనాలు…!!!
ఎమ్మెల్యే వసంత రంగ ప్రవేశం చేయడం తో కుట్రదారులు పన్నాగం బహిర్గతం….
తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం ఫెర్రీ దేవాదాయ భూముల వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి అధికార పార్టీ నీ ఇరుకున పెట్టాలని విశ్వ ప్రయత్నం చేసిన తెలుగు తమ్ముళ్ళ కుట్ర కోణాలు స్థానికులకు భోదపడ్డాయి…!! 30 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ భూముల వివాదానికి అధికార వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన పచ్చ నేతల కుటిల రాజకీయాలకు ఎమ్మెల్యే వసంత రంగ ప్రవేశం చేయడం తో కుట్ర పూరిత వ్యూహం బెడిసికొట్టింది.. కేవలం రాజకీయ దురుద్దేశం తో 200 కుటుంబాలకు చెందిన సమస్యను తన రాజకీయ లబ్ధి కోసం వివాదం చేసి వాడుకోవాలని తెలుగు తమ్ముళ్లు తన అనుకూల పత్రికలో తప్పుడు కథనాలు రాయించి ప్రజలను తప్పుదోవ పట్టించారు… కూలగొట్టి న ఇంటిపై ఇబ్రహీంపట్నం వైసీపీ నేతల కన్ను పడిందని అందుకోసంమే ఇంటిని కూలగొట్టారని పేపర్ ద్వారా కథనాలు రాయించి బాధిత కుటుంబాలను సైతం మభ్య పెట్టారు… అయితే ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆ భూముల సమస్యను భూజనకేసుకొని పరిష్కారం దిశగా ప్రభుత్వం తో మంతనాలు జరిపి సఫలీకృతం అయ్యారు… 5 ఏళ్ల టిడిపి ప్రభుత్వ హయాంలో జరగని న్యాయం వైసీపీ ప్రభుత్వం లో జరుగుతుండటం తో బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి….!!
మాజీ మంత్రి కుట్రలో భాగమేనా..???
2019 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు తనకు మెజార్టీ ఇవ్వలేదనే అక్కసుతో మాజీ మంత్రి 5 ఏళ్ల పాటు తన గుమ్మం తొక్కనివ్వలేదనేది బహిరంగ రహస్యం….అందులో భాగంగా ఫెర్రీ దేవాదాయ భూముల వ్యవహరం అపరిష్కృతంగా మిగిలిపోయిందని స్థానికులు చెబుతున్నారు… టిడిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి 5 ఏళ్ల పాటు మంత్రి గా ఉన్నప్పటికీ కొండపల్లి , ఇబ్రహీంపట్నం అభివృద్ధికి నోచుకోక పోవడానికి కూడా ఇదే కారణంగా చెప్తున్నారు… అయితే ఇప్పడు ఫెర్రీ భూముల వ్యవహరం లో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగితే ఎమ్మెల్యే వసంత దేవుడు అయిపోతాడు అనే రాజకీయ కక్ష తో 200 కుటుంబాల సమస్యను రాజకీయం చేసి అధికార పార్టీ నీ అభాసుపాలు చేసేందుకు పక్కా వ్యూహం రచించి తెర వెనుక భాగోతం నడిపించారు అనేది తేట తెల్లం అయ్యింది.. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సుమారు 200 కుటుంబాలకు చెందిన సమస్యను రాజకీయం చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడేందుకు కుట్ర చేశారని స్థానికులకు సైతం బోధపడింది… ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ దేవాదాయ భూముల సమస్య పై ఒక కమిటీ నడుస్తుండగా ఆ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో ఇబ్రహీంపట్నం టిడిపి కీలక నేత ఉండటం గమనార్హం…. ఇప్పుడు అదే నేత భూముల పై హక్కుల కోసం పోరాడు తుండటం విశేషం….