తెలుగుతేజం, నందిగామ ప్రజలలోను అధికారులలోను నాయకులలోను మంచి ఆదరణ పొందిన టువంటి తెలుగు తేజం దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ సోమవారం మా ఆఫీసు నందు ఆవిష్కరించడం చాలా ఆనందకరంగా ఉందని డి.ఎస్.పి జి నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు తేజం దినపత్రిక పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమమే దిశగా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా నిస్వార్ధంగా వార్తలు ప్రచురించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిందని, పత్రికా రంగంలో అనేకమంది వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న టువంటి సంఘటనలు ఎన్నో చూశామని, కానీ తెలుగుతేజం దినపత్రిక యాజమాన్యం వారు కానీ, మండలాల్లో పని చేసినటువంటి రిపోర్టర్లు కానీ వారి పరిమితికి లోబడి పనిచేస్తున్నట్టు సంఘటనలు మేము చూశామని అన్నారు. ఇలాంటి పత్రిక అంచెలంచెలుగా ఎదిగి ఎక్కువ ప్రజాదరణ పొందాలని ఆయన అన్నారు.