నందిగామ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
తెలుగు తేజం, నందిగామ : ఆటో, రవాణా రంగ కార్మికులపై భారాలు పెంచే జి.ఓ 21 ఉపసంహరించుకోవాలని కోరుతూ నందిగామ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో శుక్రవారం సంతకాల సేకరణ చేసారు. ఈ సందర్బంగా సిఐటియు కార్యదర్శి కె.గోపాల్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మోటారు వెహికల్ సవరణ చట్టాన్ని గత సంవత్సరం సెప్టెంబర్ జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఆమోదించింది. ఈ చట్టాన్ని ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడ ఒరిస్సా మినహ మరెక్కడా ఈ చట్టాన్ని అమలు చెయ్యడం లేదు.
ఈ చట్టంలో ప్రధానంగా ప్రమాదాలకు కారణం డ్రైవర్లను, వెహికల్ ఫీట్ నేస్ సక్రమంగా లేదని, సర్టిఫైడ్ మెకానిక్లు రిపేర్లు చేయకా పోవడం వలన అని అనేక కారణాలు చూపి ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చింది. కానీ వాస్తవంలో భారతదేశంలో లో కోటి మంది ఉపాధి పొందుతున్న ఈ రంగంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ కంపెనీలు అయినా ఓలా, ఒబేర్ వంటి వాటికి అవకాశం కల్పించడానికి. మరోవైపు విపరీతమైన జరిమానాలు ఈ చట్టం విధించింది. అందుకే దేశంలో ఏ రాష్ట్రం ఈ చట్టాన్ని అమల్లోకి ముందుకు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో జీవో నెంబర్ 21 పేరుమీద జరిమానాలు చలనాలు వందల రెట్లు పెంచుతూ తీసుకురావటం అన్యాయం. అసలే కరోనా సమయంలో ట్రాన్స్పో పోర్ట్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న సందర్భంలో ఈ జీవో వల్ల ఆటో కార్మికుల పై అదనపు భారాలు మోపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ సుబ్బారావు, నాగేశ్వరరావు, ఎం నాగరాజు, జాంబియా, నాగరాజు, నాగేశ్వరావు, ఏసోబు నాగయ్య, అశోక సునీల్ తదితరులు పాల్గొన్నారు