చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ
తెలుగు తేజం, విజయవాడ : క్రీడాకారులను ప్రోత్సహించి, చిన్నారుల లో ఉన్న క్రీడా శక్తిని వెలికి తీయడం ద్వారా దేశ ప్రతిష్టను పెంపొందించుకోవాలని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షులు, చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం విఎంసి ఓల్గా ఆర్చరీ ఫీల్డ్, విజయలక్ష్మి కాలనీ, మహానాడు రోడ్డు లోని వోల్గా ఆర్చరీ అకాడమి నందు జాతీయ పతాకాన్ని సామజిక సేవకులు కెఎస్ రావు ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆర్చరీ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్చర్లు అంతా జాతీయ పతకం ఎగురుతుండగా జాతీయ గీతాలాపన మధ్య రాష్టానికి, దేశానికి, అకాడమీకి బంగారు పతకాలు సాధించి విక్టరీ స్టాండుపై జాతీయ జెండా ఛాయలు విలువిద్యలో బంగారు పతకాలు అందుకోవాలని ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారి జి ప్రేమ్ కుమార్, అకాడమీ శిక్షకులు నవీన్ కుమార్, చిరంజీవి, నీలిమ సహాయకులు బి రాజా మరియు ఆర్చర్లు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.