
విజయవాడ, తెలుగు తేజం ప్రతినిధి: విద్యాధరపురం సితార సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ స్థలాన్ని సందర్శించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, మంటలను అదుపు చేయడంలో సత్వర చర్యలు చేపట్టినందుకు అగ్నిమాపక శాఖ అధికారులను ఆయన అభినందించారు. ఈ ఘటనపై కమిషనర్ స్పందిస్తూ ప్రాంతీయ అగ్నిమాపక అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం, జోనల్ కమిషనర్‌పై అభియోగాలు మోపడంతోపాటు సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.