
పెనుగంచిప్రోలు, (తెలుగుతేజం): మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా విచ్చేసిన స్వాములకు, భక్తులకు దేవాలయం వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి ప్రారంభించి సాయంత్రం ఐదు గంటల వరకు వచ్చిన భక్తులందరికీ అందించడం జరిగింది. సుమారు 20 వేల మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం సాయంత్రం ఐదు గంటల వరకు భక్తులకు అన్ని వంటకాలతో ఎటువంటి లోటు లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పలువురు భక్తులు తెలిపారు. గత సంవత్సరము కంటే ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం రుచికరమైన వంటకాలతో వడ్డించారని భక్తు స్వాములు తెలిపారు. అదే రకంగా అన్నదాన కార్యక్రమం వద్ద అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్వాములకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిరంతర అన్నదాన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించాలని పలువురు గ్రామస్తులు తెలిపారు.
ఈ అన్నదాన కార్యక్రమంలో సేవకులు ఎవరికి వారే స్వచ్ఛందంగా పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి వంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు వారి విధులను సక్రమంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.