
- ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి ఫిబ్రవరి 12 తెలుగు తేజం: కనిగిరి నియోజకవర్గం లోని పామూరు మండలం మోపాడు, బోట్ల గూడూరు గ్రామాలలో బుధవారం కీర్తిశేషులు కనిగిరి మాజీ శాసనసభ్యులు దివంగత ఇరిగినేని తిరుపతి నాయుడు 8వ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొని పెద్దాయన తిరుపతి నాయుడుకు ఘనంగా నివాళులు అర్పించారు. కనిగిరి నియోజకవర్గ ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజలతో మమేకమవుతూ, ప్రజాసేవే లక్ష్యంగా కనిగిరి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఇరిగినేని అని పేర్కొన్నారు. టిడిపి సీనియర్ నాయకులు,ఇరిగినేని రవీంద్రబాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్ రావు, జనసేన జిల్లా కార్యదర్శి యలమందల రహీముల్లా, టిడిపి నాయకులు పువ్వాడి వెంకటేశ్వర్లు, మోపాడు టిడిపి నాయకులు దేవరపు మాల్యాద్రి, గుర్రం వెంకటేశ్వర్లు, దారపనేని సుబ్బారావు, యరసింగ్ రాయుడు , పామూరు టిడిపి నాయకులు, యారవ శ్రీనివాసులు, ఉప్పలపాటి హరిబాబు, షేక్ ఖాజా రహమతుల్లా, మెంటా నరసింహారావు, వాయినేని రాఘవ, ఆర్ఆర్ రఫీ, గోళ్ల వెంకటేశ్వర్లు,తదితర నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పెద్దాయనకు ఘనంగా నివాళులు అర్పించారు.