
ప్రకాశం జిల్లా దర్శి మండలంలో బండివేలిగాండ్ల మరియు బశిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రాల పరిధిలోని పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి దర్శి ఏ డి ఏ కె బాలాజీ నాయక్ అధ్యక్షత న నిర్వహించడం జరిగినది. వారు మాట్లాడుతూ కంది పండించిన రైతులందరూ కూడా గ్రామ వ్యవసాయ సేవకుల దగ్గర కంది కొనుగోలు కొరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ సేవలను వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. తదుపరి క్షేత్ర సందర్శన నిర్వహించి పంట కోత తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. పంట నమోదు కార్యక్రమం ద్వారా పంట సాగు చేసినటువంటి రైతులందరూ కూడా పంట నమోదు చేయించుకోవాలని తద్వారా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని ప్రతికూల పరిస్థితుల్లో పంట నష్టం వాటిలినప్పుడు అదే విధంగా పంటలకు ఇన్సూరెన్స్ వర్తించాలన్న రైతు పండించిన పంటలను మార్కెట్లో గిట్టుబాటు ధరకు అమ్ముకోవా లన్న పంట నమోదు అవసరమని సూచించారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్నటువంటి డ్రిప్ మరియు స్ప్రింక్లర్లు రైతులు వినియోగించుకోవాలన్నారు. పంట మార్పిడి పద్ధతులు పాటించాలి అని తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ వారు మొదలు పెట్టినటువంటి రైతుల రిజిస్ట్రేషన్ గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా చేయించుకోవాలని అలా చేయించుకుంటే 11 అంకెల గుర్తింపు నెంబర్ ఇవ్వబడుతుంది అని వివరించారు ఈ కార్యక్రమములో గ్రామ వ్యవసాయ సహాయకులు కె విష్ణు వర్ధన్ రెడ్డి బండివేలిగాండ్ల ఇంచార్జి మరియు వి సాయి చంద్రకాంత్ బశిరెడ్డిపల్లి మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.