
- చిట్టేల గ్రామంలో ఓ బెల్ట్ షాపు నిర్వాహకుడు ఏకంగా అక్కడ తెలుగుదేశం వార్డు నెంబర్ సుధాకర్ పై దాడి
తిరువూరు తెలుగు తేజం ప్రతినిధి: అక్రమంగా మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేయమని ఒకవైపు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశిస్తున్నా ఆయన ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని భావిస్తున్న ప్రజలు ఈ నేపథ్యంలో చిట్యాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ వార్డు నెంబర్ అయిన సుధాకర్ పై బెల్ట్ షాప్ నివాహకుడు దాడి చేశాడని తెలిసి భారతీయ జనతా పార్టీ తిరువూరు మండల అధ్యక్షురాలు పగిడిపల్లి విజయలక్ష్మి తిరువూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుధాకర్ ను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళవారం అమరావతిలో మంత్రి కొల్లు రవీంద్ర గారు నూతన మద్యం పాలసీ తో పారదర్శకంగా ముందుకు వెళుతున్నామని చెబుతుంటే ఇక్కడ గ్రామాలలో కొందరు బెల్ట్ షాపులను యదేచ్చగా నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు. మద్యం అక్రమ బెల్ట్ షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదని ఆయన అన్న అదే రోజు తిరువూరు రూరల్ మండలంలోని చిట్యాల గ్రామంలో ఒక బెల్ట్ షాప్ నిర్వాహకుడు గ్రామాలలో అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపు నిర్వాహకుడను ప్రశ్నిస్తే ఆ బెల్ట్ షాప్ నిర్వాహకుడు ఆగ్రహంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ వార్డు నెంబర్ అయిన సుధాకర్ పై దాడి చేయడం జరిగిందని, గ్రామాలలో బెల్ట్ షాప్ నిర్వాహకుల దౌర్జన్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ సంఘటన అద్దం పడుతుందని ఆమె అన్నారు. తలకు తీవ్ర గాయం అవ్వడంతో, తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో సుధాకర్ ప్రస్తుతం తిరువూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని భారతీయ జనతా పార్టీ తిరువూరు రూరల్ మండల అధ్యక్షురాలు పగిడపల్లి విజయలక్ష్మి తెలియజేశారు. ఒకవైపు తిరువూరు నియోజవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెల్టు షాపు నిర్వాహకులపై ఉక్కు పాదం మోపమని అధికారులను ఆదేశిస్తుంటే, ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అని ఆమె అన్నారు. గ్రామాలలో అల్లర్లకు బెల్ట్ షాపులే కారణమవుతున్నాయని, ఇప్పటికైనా గ్రామాలలోని బెల్ట్ షాపులపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని, అధికారికంగా మద్యం బిల్ట్ షాపులు నిరూపిస్తున్న నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు.