
ఊటుకూరి సుధీర్ దంపతులచే ఆన పూజ – జ్యోతిర్ మహోత్సవాలకు శుభారంభం.
పెడన, బ్రహ్మపురం: శ్రీ చౌడేశ్వరి అమ్మవారి మహోత్సవాల్లో భాగంగా, ఈరోజు తెల్లవారుజాము ఊటుకూరి సుధీర్ దంపతులచే ఆన పూజ నిర్వహించబడింది. ఈ పూజతో జ్యోతిర్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. న పూజ అనంతరం అమ్మవారికి విశేష నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజనాలతో నిండిపోయింది. పూజా కార్యక్రమాలను ఆలయ పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహోత్సవాల సందర్భంగా హోమాలు, వేద పారాయణం, అన్నదానం వంటి విశేష కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాత్రి దీపోత్సవం, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ అమ్మవారి కృపకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మహోత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.