Breaking News

ఎన్నికల కోడు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు : పెనుగంచిప్రోలు ఎస్ఐ గరికపాటి రామకృష్ణ

తెలుగు తేజం, పెనుగంచిప్రోలు : పంచాయతీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెనుగంచిప్రోలు ఎస్ఐ గరికపాటి రామకృష్ణ హెచ్చరించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తముగా పంచాయతీ ఎన్నికల సందర్భముగా ఎన్నికల కోడు అమలులో ఉందని ఎవరైనా సోషల్ మీడియాలలో పార్టీల గురించి లేదా నాయకుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినా, తప్పుడు ప్రచారములు చేసినా, ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు లేదా మద్యము పంపకములు చేసిన పార్టీల మధ్య గొడవలు చెలరేగేలా వ్యాఖ్యలు చేసినా ఎన్నికల కోడు ఉల్లంఘన కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *