Union Finance Minister Nirmala Sitarama
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం అని.. విభజన అనంతరం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. గురువారం నాడు పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడ్డుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో స్పందించిన నిర్మలా సీతారామన్.. కాంగ్రెస్ ఎంపీల వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదని స్పష్టం చేశారు.