తెలుగు తేజం, నందిగామ: అర్ధరాత్రి సమయంలో వాహనాలను అడ్డుకుని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న తొమ్మిది మంది విలేఖరులపై వీరులపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.జగ్గయ్యపేట 6 టీవీ ఛానల్ కు చెందిన విలేఖరి కొండ్రు సందీప్ మరియు 19 యూట్యూబ్ ఛానల్ కు చెందిన శ్రీనివాస్, విట్నెస్ యూట్యూబ్ ఛానల్ కు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తులు గత ఆదివారం రాత్రి సమయంలో వీరులపాడు మండలం జయంతి గ్రామంలో రహదారిపై వెళ్తున్న లారీని ఆపి తమ దగ్గర ఉన్న కత్తిని చూపించి డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో లారీ వెనుక వస్తున్న ముఠా కార్మికులు లారీ డ్రైవర్ తో కలసి 6టివి రిపోర్టర్ సందీప్ ను చితకబాది ముగ్గురు వ్యక్తులను వీరులపాడు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. లారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా వీరితో కలిసి గతంలో ఇదే విధమైన అక్రమ వసూళ్లకు పాల్పడిన నందిగామ ఆంధ్రప్రభ విలేఖరి సత్యనారాయణ రెడ్డి , కోస్తాప్రభ విలేఖరి బండారు తిరుపతిరావు , హెచ్ 6 యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఉప్పుతోళ్ల వీరబాబు , జి న్యూస్ యూట్యూబ్ ఛానల్ విలేఖరి కొంగర నవీన్ ,వి.ఎస్.బి యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఆవుల గోపికృష్ణ , చిరుమామిళ్ళ వెంకటేష్ (చిన్నా) 19 టీవీ అనే మరొక యూట్యూబ్ ఛానల్ విలేఖరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు తొమ్మిది మందిపై సంబంధిత సెక్షన్లలో కేసు నమోదు చేసామని డి.ఎస్.పి.జి.నాగేశ్వర రెడ్డి సమావేశంలో తెలిపారు.సమాజాన్ని బాగుచేయాల్సిన విలేఖరి ఇలా చెడు మార్గంలో నడవడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నందిగామ రూరల్ సి.ఐ..సతీష్, వీరులపాడు ఎస్.ఐ హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.