పోలింగ్ ముగియడంతో YSR చేయూత, విద్యా దీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం లాంటి పథకాల డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఈ నెల 14 నుంచే డబ్బులు అకౌంట్లలో వేసుకోవచ్చని ఈసీ పర్మిషన్ ఇచ్చింది.కానీ రెండు రోజులు గడిచినా ప్రభుత్వం రూ. 14,165 కోట్ల నిధులను విడుదల చేయలేదని అందరూ ఎదురుచూపులకు స్వస్తి పలికి ఈ రోజు జగనన్న విద్యా దీవెన కోసం 502 కోట్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరాకు సంబంధించి 1,480 కోట్ల నిధులు ప్రభుత్వ అధికారులు విడుదల చేశారు.. అలాగే మిగతా రెండు మూడు రోజుల్లో మిగతా డిబిటి పథకాల నిధుల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం.జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.