తెలుగు తేజం, విజయవాడ : ఇసుక కొరత డిమాండ్ దృష్టిలో పెట్టుకొని పలువురు ముఠాలుగా ఏర్పడి కృష్ణలంక పద్మావతి ఘాట్ ను ఇసుక రిచ్ గా మార్చేశారు. నదిలోని ఇసుకను తోడి దానిని సిమెంట్ బస్తాల్లో నింపి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల వచ్చిన వరదలు తగ్గడంతో ఇసుక మేటలు వేయడం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. రోజు వేల బస్తాల ఇసుకను అమ్మి పెద్ద మొత్తంలో వారు సొమ్ము చేసు కుంటున్నారు.