తెలుగు తేజం, కంచికచర్ల : కంచికచర్ల మండల పరిధిలో బత్తినపాడు గ్రామం లో శెనగ లో పొలంబడి కార్యక్రమం జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీమతి. Y. అనురాధ, శ్రీమతి. K. జ్యోతి రమణి ఆధ్వర్యంలో జరిగింది.. ఈ కార్యక్రమంలో అనురాధ, జ్యోతి రమణి గార్లు మాట్లాడుతూ శెనగ లో విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు.. ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 500 గ్రా ఎకరాకు పిచికారీ చేసుకోవాలని సూచించారు. శెనగ పచ్చ పురుగు రాకుండా పొలానికి నాలుగు వైపులా బంతి మొక్కలు వేసుకోవాలని సూచించారు.. లింగకర్షక బుట్టలు కూడా పెట్టుకోవాలని సూచించారు.. సహాయ వ్యవసాయ సంచాలకులు నందిగామ శ్రీ రమణ మూర్తి గారు మాట్లాడుతూ పొలంబడి లో ప్రాథమిక సూత్రాలు, వ్యవసాయ శాఖ స్కీం లపై, రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రెంటపల్లి సురేష్, VAA శ్రీనివాస్, రఘు, ZBNF CRP కవిత, సూరిబాబు పాల్గొన్నారు