విజయవాడ : జిల్లాలో గురువారం కొత్తగా 86 మందికి కరోనా వైరస్ సోకింది. మరో బాధితుడు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 46,472కు పెరిగాయి. కరోనా మరణాలు అధికారికంగా 652కు చేరుకున్నాయి. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 133 మంది వ్యాధి నుంచి కోలుకుని తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 994 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.