హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవయసాయ క్షేత్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.. సీఎం కేసీఆర్ సతీమణితో కలిసి రాజశ్యామల యాగం లో పాల్గంటున్నారు .తొలి రోజైనా నేడు తెల్లవారుజామున .విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యాగానికి సంకల్పంతో శ్రీకారం చుట్టారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు పాల్గొంటున్నారు..రెండోరోజు వేదపారాయణలు, హోమం తదితర క్రతువులు నిర్వహిస్తారు. చివరిరోజు పూర్ణాహుతి ఉంటుంది.