తెలుగు తేజం కంచికచర్ల : అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరుకృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి హరి కృష్ణారెడ్డి తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఈ రోజు కంచికచర్ల లో ఉదయం 5 గంటలకు కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జి.హరికృష్ణారెడ్డి కంచికచర్ల మండల అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ ఖాసిం కాశి బోయిన రాంబాబు లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భవన నిర్మాణ కార్మికులు జిల్లా అధ్యక్షులు ఇంటికి చేరుకొని చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్నా నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేయటం సరైన పద్ధతి కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు హరి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ సంవత్సరంన్నరనుండి కాళ్ళు చేతులు విరిగి ప్రాణాలను కోల్పోయి సంక్షేమ బోర్డు అప్లై చేసుకున్న కార్మికులకు రావలసిన సుమారు 60 కోట్ల రూపాయల నష్టపరిహారాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఇవ్వలేదు పైగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు రావాల్సిన నష్టపరిహారం వారిని అకౌంట్లో జమ చేసి ఇసుక లేక పని కోల్పోయిన కరొనావల్ల పని కోల్పోయిన కార్మికులకు సంక్షేమ శాఖ ఇస్తానన్న ఆర్థిక సహాయం తక్షణమే కార్మికులు అకౌంట్లో జమ చేయాలి ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలి భవన నిర్మాణ కార్మికుల మెటీరియల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకోవాలి కార్మికులకు పనులు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.