Breaking News

జగ్గయ్యపేటకు త్వరలో ప్యాసింజర్ రైలు తీసుకువస్తాం : ప్రపుల్ల శ్రీకాంత్

ఖరారైన ప్రపుల్ల శ్రీకాంత్ పాదయాత్ర
నియోజకవర్గ స్థాయిలో జగ్గయ్యపేట ప్యాసింజర్ రైలు సాధన సమితి కమిటీ ఏర్పాటు
జనవరి 12వ తేదీ భారతీయ జనతా పార్టీ విజయవాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రపుల్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభం
13 వ తేదీ ప్రముఖులకు వినతిపత్రం అందజేత
అతి త్వరలోనే ప్యాసింజర్ రైలు జగ్గయ్యపేట కు వస్తుందని తేల్చి చెప్పిన భాజపా బృందం

తెలుగు తేజం, జగ్గయ్యపేట : జగ్గయ్యపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు భారతీయ జనతా పార్టీ విజయవాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రపుల్ల శ్రీకాంత్ అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగ్గయ్యపేట పట్టణానికి ప్యాసింజర్ రైలు అతి త్వరలోనే తీసుకువస్తామని ఈ మేరకు జగ్గయ్యపేట ప్యాసింజర్ రైలు సాధన సమితి కమిటీ ఏర్పాటు చేసినట్లు ఈ నెల 12వ తేదీ వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రగా బయలుదేరి మక్కపేట పెనుగంచిప్రోలు శనగపాడు మీదుగా 13వ తేదీకి విజయవాడ చేరుకొన్నట్లు శ్రీకాంత్ తెలియజేశారు ప్యాసింజర్ రైలు జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఎంత వరకు అవసరమో ప్యాసింజర్ రైలు వల్ల నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ ప్రజల ప్రయాణం పారిశ్రామిక అభివృద్ధి వంటి కీలక అంశాలు గురించి పెద్దలతో చర్చలు జరుగుతున్నట్లు అతి త్వరలోనే తీపి కబురు భారతీయ జనతాపార్టీ జగ్గయ్యపేట ప్రజలకు చెప్ప పోతుందని నిరంతరం ప్రజాసేవలో ప్రజల పక్షాన ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన అన్నారు అనంతరం భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ 1985 నాటి పరిస్థితులను ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు జగ్గయ్యపేట పట్టణంలో జరిగిన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొడాలి అపర్ణ భారతీయ జనతా పార్టీ విజయవాడ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ల శ్రీకాంత్ భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన్నె శ్రీనివాస రావు పట్టణ ప్రధాన కార్యదర్శి గోలి రాఘవ రూరల్ ఇన్చార్జి కిషోర్ బాబు వత్సవాయి మండల ప్రధాన కార్యదర్శులు షేక్ నాగుల్ మీరా లంకెల మల్లారెడ్డి యువ నాయకుడు పాత కోటి సాయిగణేష్ భారతీయ జనతాపార్టీ నాయకులు ధనుంజయ వర్మ జగన్ మోహన్ రావు పలువురు భాజాపా శ్రేణులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *