తెలుగు తేజం , విజయవాడ : జిల్లాలోలో అదనంగా 104 ఇసుక రీచ్ లను గుర్తించామని వీటి ద్వారా 53 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ ఏ.యండి . ఇంతియాజ్ అన్నారు . నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో డిఎ ఎస్ సి ( డిస్టిక్ లెవల్ సాండ్ కమిటి ) సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఇప్పటికే అన్ని అనుమాతులతో 10 ఇసుక రీలను సిద్ధంగా ఉన్నాయని వరద నీరు తగ్గిన తరువాత ఈ రీల ద్వారా ఇసుకను సరఫరా చేస్తామని అన్నారు . ఈ రీచ్ లో 4 లక్షల 12 వేల 200 క్యూబిక్ మీటర్లల ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ అన్నారు . ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతాల్లో 47 ఇసుక రీచ్ లను , దిగువ ప్రాంతాల్లో 11 ఇసుక రీలను గుర్తించమని ఈ రీచ్ లో 27 లక్షల 29 వేల 590 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ అన్నారు . గూగుల్ మ్యాప్ అనుసరించి మరో 46 ఇసుక రీలను గుర్తించమని వీటి ద్వారా 22 లక్షల 10 వేల 900 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో వుంటుందని కలెక్టర్ అన్నారు . గనులశాఖ , రెవెన్యూ , భూగర్భజలశాఖ , ఆర్డబ్ల్యుఎస్ , ఇరిగేషన్ సంయుక్తంగా జాయింట్ ఇన్ స్పెషన్ నిర్వహించి ఈ రీలకు సంబంధించి నివేదిక అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు . ఇసుక అక్రమ రవాణా అరికట్టుటకు కట్టుదట్టమైన చర్యలు తీసుకున్నామని ఇందుకు సంబంధించి విజులెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పనిచేస్తుందని కలెక్టర్ అన్నారు . ఏపియండిసికి చెందిన 4 ఉద్యోగులుపై ఇసుక అక్రమ రవాణాకు సంబందించి కేసులు నమోదు చేశామని , చట్టప్రకారం చర్యలు తసుకుంటామని కలెక్టర్ అన్నారు . విజయవాడ పరిధిలోని ఇసుక అక్రమరవాణాకు సంబంధించి 60 కేసులు నమోదు చేశామని స్పషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో విజయవాడ , అడిషనల్ ఎపి యం.సత్తిబాబు అన్నారు . ఇందుకు సంబందించి 79 మందిని అదుపులోకి తీసుకున్నామని 69 వాహనలను , 41 లారీలను , 39 టాక్టర్లను , 608 టన్నుల ఇసుకను జీజ్ చేశామని ఆయన అన్నారు . పమిడిముక్కల మండలంలో బిల్లులు లేకుండా ఇసుక అక్రమరవాణాకు సహకరించిన ఎపియండిసి చెందిన 4 ఉద్యోగులపై కేసులు నమోదు చేశామని అడిషనల్ ఎస్సీ యం.సత్తిబాబు అన్నారు . కృష్నాజిల్లా స్పషల్ బ్రాంచ్ డిఎ పి కె ధర్మేంద్ర మాట్లాడుతూ జిల్లాలో రూరల్ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 22 కేసుల నమోదు చేశామని 80 మందిని అదుపులో తీసుకున్నామని 20 వాహనాలను సీజ్ చేశామని , 220 మెట్రిక్ టన్నుల ఇసుక సీజ్ చేశామని ధర్మంద్ర తెలిపారు . ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ ) డా.కె. మాధవీలత , విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్.యం. ధ్యానచంద్ర , స్పషల్ ఎఫోమెంట్ బ్రాంచ్ విజయవాడ అడిషనల్ ఎస్సీ యం.సతిబాబు , స్పషల్ బాంచ్ డిఎస్ పి కె . ధర్మేంద్ర , ఆర్ డబ్ల్యుఎస్ ఎస్సీ సాయినాద్ , గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యం . సుబ్రమణ్యం , శ్రీమతి నాగిని , ఇరిగేషన్ ఎస్ సి నరసింహము , ఇరిగేషన్ శాఖ ఇఇ స్వరూప్ , తదితరులు పాల్గొన్నారు .