తెలుగు తేజం, గన్నవరం : డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రత ప్రమాణాలు నియమాలు పాటించాలని రోడ్డు నిబంధనల ప్రకారమే వాహనాలను నడపాలని మోటార్ వాహన తనిఖీ అధికారి నాగమురళి అన్నారు. స్థానిక గన్నవరం ఫిట్నెస్ కేంద్రం వద్ద శుక్రవారం వాహన యజమానులతో డ్రైవర్లతో రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా డ్రైవర్లతో రోడ్డు భద్రత అంశాలపై అవగాహన కల్పిస్తూ సూచనలు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ఎదుటి వచ్చే వాహనాలను గమనిస్తూ ప్రయాణం చేయాలన్నారు. అప్పుడే సురక్షితంగా గమ్యాన్ని చేరుకోగలమని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు కె ప్రసాద్, శ్రీమతి రాధికాదేవి, కానిస్టేబుల్స్, డ్రైవర్లు ఉన్నారు