తెలుగు తేజం , కంచికచర్ల : కంచికచర్ల మండలం కీసర గ్రామం లో ఇటీవల నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను రైతులు, తెలుగు దేశం నాయకులతో కలిసి సోమవారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాటలుడు జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడపలు దాటడం లేదని 18వ తేదీ జరిగే మంత్రి మండలి సమావేశంలో రైతులు చెప్పే బాధలు వినండి అసమర్థ చేతగాని దద్దమ్మ మంత్రులు ఒక్కరు కూడా చేలోకొచ్చి రైతులకు ధైర్యం చెప్పే వారు లేరు ధాన్యం కొనేదిక్కు లేక రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. రైతులు తీవ్ర గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు రైతు భరోసా కేంద్రాల్లో సమధానం చెప్పే దిక్కులేదు . ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు
కౌలురైతాంగం ఆవేదన పట్టించుకోరా ? దెబ్బతిన్న రైతులను ఆదుకుని మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానికి లేదా ? రైతుల వద్ద పత్తిని బయ్యర్లు కొనుగోలు చేయకుండా రైతులను దళారులకు అప్పజెప్పారు రైతుల వద్ద దళారులు రూ.2900లకు కొనుగోలు చేసి యార్డుల్లో రూ.5800లకు అమ్ముతున్నారు రూ.1472లు రావాల్సిన ధాన్యం 1000-1100 రూపాయలు కూడా రాని పరిస్థితి ఉంటే సివిల్ సప్లయ్స్ మంత్రి బూతులు తిడుతూ, పేకాట ఆడుకుంటున్నారు. సుమారు 8 లక్షల రేషన్ కార్డుల తొలగింపుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసారు వేలాది, లక్షలాది మంది వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తున్నట్టు ? సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ఏం పాపాలు జరుగుతున్నాయో ఒక్కసారి సీసీ కెమెరాలు పెట్టుకుని చూడండి జగన్మోహన్ రెడ్డి రైతుకు నష్ట పరిహారం వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోరాటం చేసి 100శాతం సబ్సీడీతో బండి విత్తనాలు ఇచ్చి తిరిగి పొలాల్లో వ్యవసాయం మొదలుపెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందిఈ కార్యక్రమంలో దేశ నాయకులు కోగంటి బాబు. కుక్కల శ్రీను . బడే హజరత్ . రోశయ్య షేక్ బాషా వేల్పూర్ వెంకట్రావు మార్తా నరసింహారావు శంఖ సాంబయ్య రెడ్డి శ్రీను. గారపాటి ప్రసాద్ చిన్నబ్బాయి నరేంద్ర సజ్జ అజయ్ గుత్త ఓంకార్. కేబుల్ ప్రసాద్ వనపర్తి వెంకటేశ్వరరావు సీతారామయ్య తదితర రైతులు పాల్గొన్నారు.