తెలుగు తేజం, తిరువూరు : చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆ కుర్రాడికి ఎనలేని ఇష్టం.ఆ ఇష్టం అతనిని పట్టువదలని విక్రమార్కుల్లా మార్చింది తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.పాఠశాల స్థాయి నుంచి క్రికెట్ లో దేశం తరుపున ఆడటానికి ఆశ తో ఎదురు చూస్తున్న హర్ష వర్ధన్.
గంపలగూడెం మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన కంటమనేని హర్ష వర్ధన్ చిన్నప్పటినుండి క్రికెట్ అంటే ఎనలేని ఇష్టం.క్రికెట్ అనే తపనతో చిన్నప్పటినుంచి చదువుతోపాటు క్రికెట్ కి విలువ ఇచ్చేవాడు.హర్షవర్ధన్ తల్లిదండ్రులు రమాదేవి వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా వ్యవసాయ కుటుంబం… తల్లిదండ్రులు, స్నేహితులు సోదరులు ప్రొత్సహంతో క్రికెట్ లో రాణిస్తున్నాడు.
పాఠశాల స్థాయిలోనే క్రికెట్ కెప్టెన్గా వ్యవహరించిన హర్షవర్ధన్ తర్వాత డిగ్రీలో స్థాయి లో కూడా క్రికెట్లో రాణించాడు.క్రికెట్ లో మెలుకువల కోసం హైదరాబాద్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.
హర్ష వర్ధన్ కర్ణాటక స్టేట్ క్రికెట్ తరుపున కూడా ఆడారు.
వికెట్ కీపర్ గా స్టంపింగ్ లో హర్ష వర్ధన్ రికార్డు నెలకొల్పాడు.రైట్ హాండ్ బ్యాట్స్ మెన్ గా బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు. ఐపీఎల్ తో పాటు దేశం కోసం ఆడటానికి ఎదురుచూస్తున్న హర్షవర్ధన్ కు అవకాశం కల్పించాలని క్రిష్ణ జిల్లా వాసులు కోరుకుంటున్నారు.