తెలుగు తేజం, జగ్గయ్యపేట:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జగ్గయ్యపేట పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న పాలేరు ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ముత్యాల వెళ్లే రోడ్డు మార్గం అత్యంత ప్రమాదకరమైన ఉండటంతో అక్కడి వరద ఉధృతి చూడడానికి వెళ్లిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో వాహనదారులకు భద్రత సూచనలు ఇవ్వడం జరిగిందని ఈ నేపథ్యంలో అటుగా వస్తున్న ఓ యువకుడు ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడిపోవడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు మోకాలు లోతు కుంటల్లో అత్యంత దారుణంగా ఉన్న రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఏ మాత్రం పొరపాటు జరిగినా ఆ వరదలో కొట్టుకు పోయె ప్రమాదం ఉందని అత్యంత ప్రమాదకరంగా ఉన్న పాలేరు బ్రిడ్జి వద్ద కనీసం సూచనలు కూడా అధికారులు ఇవ్వకపోవడంపై భారతీయ జనతా పార్టీ విజయవాడ పార్లమెంటరీ రూరల్ కన్వీనర్ ప్రపుల్ల శ్రీకాంత్ మండిపడ్డారు ఈ విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య ధోరణికి కారణం ఏమిటో బయటపెడతామని శ్రీకాంత్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జగ్గయ్య పేట పట్టణ అధ్యక్షులు వంగవీటి రంగారావు రూరల్ కన్వీనర్ కిషోర్ బాబు వత్సవాయి మండలం అధ్యక్షుడు దామల ప్రసాదు సీనియర్ నాయకులు మన్నె నాగబాబు పలువురు భారతీయ జనతా పార్టీ యువత పాల్గొన్నారు