విజయవాడ (తెలుగుతేజం ప్రతినిది):స్ఫూర్తి కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బందర్ రోడ్ లోని ఠాగూర్ మెమోరియల్ గ్రంధాలయంలో ఆదివారం యోగ తరగతులు (6 వ ) యోగ టీచర్ ప్రభాకర్ , యోగ ప్రదర్శనకారుడు
గుణశేఖర్ అద్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా యోగ టీచర్ ప్రభాకర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక విశ్వగురువు , సైంటిఫిక్ సెయింట్ , పూర్ణ గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు అనుగ్రహించిన ఆసన , ప్రాణాయామ , యోగ ప్రక్రియలో విద్యార్థులకు ఉచిత శిక్షణl ఇస్తున్నట్లుగా చెప్పారు. శ్రీమతి కాదంబరి జ్యోతి అధ్యాపకురాలు మాట్లాడుతూ జీవితంలో భౌతికం, ఆధ్యాత్మికం రెండూ భాగమే. రెండింటినీ సమన్వయం చేస్తేనే ఆ జీవితం పరిపూర్ణం అవుతుంది’ అని గురువు విశ్వస్ఫూర్తి ప్రబోధించారని తెలిపారు. స్ఫూర్తి కుటుంబం ట్రస్టీ చొప్పరపు నారాయణ రావు వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే ప్రస్థాన సాధన చేయాలి అని
గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి తెలియజేసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారిణి రమాదేవి స్ఫూర్తి కుటుంభం వాలంటీర్స్ ఇతరులు పాల్గొన్నారు