తెలుగు తేజం, కంచికచర్ల : భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళటానికి అనుమతులు లేవని కంచికచర్ల మండల బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులైన జి హరి కృష్ణా రెడ్డి కి సయ్యద్ ఖాసిం కు కాశి బోయిన రాంబాబుకు ముందస్తుగా పోలీసులు నోటీసులు అందజేసారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కు జీవో నెంబర్లు మార్చి డబ్బులు కాజేసిన ప్రభుత్వాన్ని మాత్రం వదిలేసి మా డబ్బులు నువ్వు ఎందుకు తీసుకున్నావు మా డబ్బులు మా సంక్షేమ బోర్డు లో తిరిగి జమచేయమని అడగటానికి చలో విజయవాడ వెళుతున్న భవన నిర్మాణ కార్మికులకు పోలీసులు నోటీసులు అందజేయటమ సంవత్సరంన్నర గా రాష్ట్ర వ్యాప్తంగా కాళ్లు చేతులు విరిగి ప్రాణాలను కోల్పోయి వారిపై ఆధారపడ్డ కుటుంబాలు అదే సంవత్సరంన్నరగా ఇసుక లేకపోవడం వల్ల కరోనా వచ్చి కుటుంబాలు రోడ్డున పడుతుంటే వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం చేయకపోగా ఇవ్వవలసిన నష్టపరిహారాలు ప్రభుత్వం ఇవ్వకపోగా ఇసుక లేక పని కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి *ఆర్థిక సహాయం ఇస్తామని *చెప్పిన ప్రభుత్వం కార్మికుల వద్దనుండి సంక్షేమ బోర్డు కార్డు జిరాక్స్ కార్మికుడి బ్యాంక్ ఎకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని ఆరు నెలలు కావస్తున్నా కార్మికుడికి ఎక్కడ ఒక్క రూపాయి కార్మికులు ఎకౌంటు జమ చేయకపోగా కార్మికుల ప్రయోజనాల కోసం ఖర్చు చేయవలసిన డబ్బులను కార్మికుల ప్రయోజనాలను గాలికొదిలేసి ప్రభుత్వాలు వారి ప్రయోజనాలు ఉపయోగపడే విధంగా జీవో నెంబర్ మార్చి లబ్ధి పొందుతున్నారు. అటువంటి ప్రభుత్వాలను మాకు పని చూపించండి లేదా సంక్షేమ బోర్డు నుంచి ఆర్థిక సహాయం అందజేయండి పని చేసే సందర్భాలలో ప్రమాదాలకు గురైన కార్మికులకు నష్టపరిహారాలు ఇవ్వవలసిన 60 కోట్లు తక్షణమే విడుదల చేయాలని సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసే విధానాన్ని మార్చుకోవాలని అడిగేందుకు చలో విజయవాడ వెళ్తున్న భవన నిర్మాణ కార్మికులకు ముందస్తుగా వెళ్ళుటకు పరిమిషన్ లేదని నోటీసుల అందజేయటం సరైన పద్ధతి కాదని ఇదే పద్ధతిలో నోటీసు ఇవ్వటం ముందస్తు అరెస్టులు చేయడం కొనసాగే పద్ధతి అయితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం చేసే పనులన్నీ కార్మికులు గుర్తుంచుకుని కార్మికులు కూడా రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఎదురు చూస్తూ అవకాశం వచ్చినప్పుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి తీసుకున్న డబ్బులను తక్షణమే బోర్డుకు జమ చేయాలి సంక్షేమ బోర్డు నుండి కార్మికులకు ఇస్తానన్న ఆర్థిక సహాయం తక్షణమే కార్మికుల ఎకౌంట్లో జమ చేయాలని సంవత్సర కాలంగా ప్రమాదాలకు గురయ్యే నష్టపరిహారం కోసం అప్లై చేసుకున్న కార్మికులకు తక్షణమే నష్టపరిహారం వారి ఎకౌంట్లో జమ చేయాలని కృష్ణా జిల్లా బిల్డింగ్ డిమాండ్ చేస్తున్నాం