హైదరాబాద్ . మాజీ ఎంపీ, సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు రిజైన్ లెటర్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాసేపట్లో వివేక్ వెంకట స్వామి నోవా టెల్ హోటల్ కు వెళ్లి రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు.