తెలుగు తేజం, మచిలీపట్టణం : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే మాతృ వియోగం పొందిన రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటికి వెళ్లి శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు.మంత్రి తల్లి దివంగత పేర్ని నాగేశ్వరమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మంత్రి తల్లి ఎంతోకాలం నుండి అనారోగ్యంగా ఉండగా ఆసుపత్రిలో ఆమె తీసుకున్న చికిత్స ఆమె అనారోగ్య పరిస్థితుల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రికి అదర్య పడవద్దని తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీర్చలేరు అని మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తండ్రి లేని లోటు నాకు అవగతమైన ని ఈ సమయంలోనే నిబ్బరంగా ఉండాలని ఓదార్చారు. తన తల్లి గత నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్దారని మాతో ఎంతో ప్రేమగా ఉండేవారని ఆమె లేని లోటు మా కుటుంబానికి తీరని లోటని మంత్రి పేర్ని ముఖ్యమంత్రికి చెప్పారు. కుటుంబ సభ్యులు తన భార్య జయసుధని, తన కుమారుడు పేర్నినాని కృష్ణమూర్తి (కిట్టు), తన సోదరి వసుంధర, బావ డాక్టర్ ఆనంద్ కుమార్ లను ముఖ్యమంత్రి కి పరిచయం చేశారు. అనంతరం స్థానిక నాయకులను మంత్రి పేర్ని ముఖ్యమంత్రి కి పరిచయం చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, పెడన, శాసనసభ్యులు జోగి రమేష్, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, పామర్రు శాసనసభ్యులు అనిల్ కుమార్, నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు , తిరువూరు శాసనసభ్యులు కె రక్షణ నిధి, దెందులూరు శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవి లత, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, విజయవాడ తూర్పు నియోజక వైసీపీ పార్టీ ఇంచార్జి దేవినేని అవినాష్ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.