తెలుగుతేజంం, అమరావతి: మానవ హక్కుల మిషన్ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా ఎస్.జి. కుమార్ ను నియమించి నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలుగు తేజం ప్రతినిధితో మంగళవారం విజయవాడలో ఆయన మాట్లాడారు. సౌత్ ఇండియా ఇన్చార్జిగా కొనసాగుతున్న నన్ను హ్యూమన్ రైట్స్ మిషన్ జాతీయ చైర్మన్ డాక్టర్ మహేంద్ర శర్మ, న్యూఢిల్లీ జాతీయ కార్యాలయం నుంచి నియామక పత్రాన్ని పంపించినట్లు తెలియజేశారు. దేశంలో ఎవరికీ మానవ హక్కులకు విఘాతం కలిగిన వారు నేరుగా మానవ హక్కుల మిషన్ భారతదేశంలోని ఆయా రాష్ట్రాల్లో కొన సాగుతున్న మండల, జిల్లా, డివిజన్, రాష్ట్ర కమిటీలను సంప్రదించి ఫిర్యాదులను లిఖితపూర్వకంగా సమర్పించ వచ్చారు. ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీస్ వ్యవస్థ ద్వారా ఎఫ్ ఐ ఆర్ ఎట్లా నమోదు చేస్తారో, అదేవిధంగా మానవ హక్కులకు విఘాతం కలిగిన వ్యక్తులు వారి లిఖితపూర్వక ఫిర్యాదులను నేరుగా టి ఐ ఆర్ (టార్చర్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) తయారుచేసే ఒకే ఒక్క సంస్థ మానవ హక్కుల మిషన్ అని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ హ్యూమన్ రైట్స్ మిషన్ సేవలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల సంస్థలోని ప్రతి ఒక్క సభ్యుడు/ సభ్యురాలు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హ్యూమన్ రైట్స్ మిషన్ లోని పలువురు ముఖ్యులు దుశ్శాలువ లతో, పూలమాలలతో ఆయనను సత్కరించారు. అలాగే భారతరాజ్యాంగంలోని నియమ నిబంధనలతో పాటుగా మానవ హక్కుల మిషన్ యొక్క నియమ నిబంధనలు కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క సభ్యులు పాటించి తీరాలని, లేనిపక్షంలో వారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోనని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల మిషన్ జాతీయ కమిటీ చైర్మన్ మరియు జాతీయ, రాష్ట్ర, డివిజన్, జిల్లా, మండల నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.